- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అవినీతి అధికారుల ఆస్తులు దాదాపు @100 కోట్లు అటాచ్...
దిశ, సిటీక్రైం : డబ్బు కోసం సామాన్యుడిని ఇబ్బందికి గురి చేసిన అవినీతి ప్రభుత్వ ఉద్యోగుల పై ఏసీబీ ఈ ఏడాది పంజా విసిరింది. ఈ సంవత్సరంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు 152 కేసులను నమోదు చేసి 223 మందిని అరెస్టు చేసింది. ఇందులో 129 కేసులలో 200 మంది అవినీతి ఆఫీసర్స్ తో పాటు వారికి సహకరించిన ప్రైవేట్ వ్యక్తులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 11 ఆదాయానికి మించిన కేసులను నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. 12 క్రిమినల్ చర్యలకు అస్యారం ఇచ్చిన కేసులను నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు మంగళవారం తమ వార్షిక నివేదికను విడుదల చేసింది. 105 మంది అవినీతి అధికారులను విచారించేందుకు ప్రభుత్వం నుంచి ఏసీబీ అనుమతిని పొందింది.
ఈ ఏడాదిలో 16 మంది ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిని కోర్టు ముందు రుజువు చేసి వారిని ముద్దాయిలుగా జైలుకు పంపింది. అవినీతితో ఆదాయానికి మించి అక్రమాస్తులను కూడబెట్టిన రూ.97.42 కోట్ల ను ఏసీబీ అటాచ్ చేసిందని వివరించింది. ఏసీబీ కేసులలో అవినీతి అధికారుల నేరాలను నిరూపించేందుకు అవసరమైన మెలుకువలతో పాటు వారికి శిక్ష పడేలా చేసేందుకు ఉపయోగపడే ప్రత్యేక ట్రైనింగ్ ప్రోగ్రాంలను నిర్వహించారు. బాధితులు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే 1064 కు సమాచారం అందించాలని ఏసీబీ అధికారులు కోరుతున్నారు.