Karun Nair : వరుసగా మూడు సెంచరీలు.. కరుణ్ నాయర్, ప్రభ్‌సిమ్రన్ సింగ్ వరల్డ్ రికార్డు

by Sathputhe Rajesh |   ( Updated:2025-01-03 12:50:47.0  )
Karun Nair : వరుసగా మూడు సెంచరీలు.. కరుణ్ నాయర్, ప్రభ్‌సిమ్రన్ సింగ్ వరల్డ్ రికార్డు
X

దిశ, స్పోర్ట్స్ : భారత బ్యాట్స్‌మెన్, విదర్భ కెప్టెన్ కరుణ్ నాయర్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా మూడు సెంచరీలు చేయడంతో ఆయన ఈ రికార్డు నమోదు చేశాడు. ఉత్తరప్రదేశ్‌తో విజయనగరంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేయడం ద్వారా నాయర్ ఈ రికార్డు బ్రేక్ చేశాడు. 308 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విదర్భ ఓపెనర్లు నాయర్, యష్ రాథోడ్ సెంచరీలతో రాణించారు. దీంతో యూపీపై విదర్భ 8 వికెట్ల తేడాతో సునాయసంగా గెలుపొందింది.

నాయర్ ఖాతాలో మరో రికార్డు

ఆడిన చివరి నాలుగు మ్యాచ్‌ల్లో నాయర్ నాటౌట్‌గా నిలిచి 111, 44, 163, 111 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో 70 పరుగులు పూర్తి చేసిన నాయర్ లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో తన వికెట్ కోల్పోకుండా 500 పరుగులు చేసిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేయడం ద్వారా 2010లో న్యూజిలాండ్ ఆల్ రౌండర్ జేమ్స్ ఫ్రాంక్లిన్ తన వికెట్ కోల్పోకుండా చేసిన (527) పరుగుల రికార్డును అధిగమించాడు.

ప్రభ్ సిమ్రన్ సింగ్ సైతం..

పంజాబ్ జట్టు ఆటగాడు ప్రభ్ సిమ్రన్ సింగ్ సైతం హ్యాట్రిక్ సెంచరీలు నమోదు చేశాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా హైదరాబాద్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేయడం ద్వారా వరుసగా మూడు సెంచరీలు చేసిన బ్యాట్స్ మెన్‌గా నిలిచాడు. ముంబాయిపై (150), సౌరాష్ట్రపై (125) పరుగులు చేసిన ప్రభ్ సిమ్రన్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో 105 బంతుల్లో 137 పరుగులు చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 426/4 పరుగులు చేయగా హైదరాబాద్ 47.5 ఓవర్లలో 346 పరుగులకు ఆలౌట్ అయింది.

Advertisement

Next Story

Most Viewed