Janasena:పిఠాపురంలో జనసేన ప్లీనరీ.. ఆ మూడు రోజులు పండగే!

by Jakkula Mamatha |
Janasena:పిఠాపురంలో జనసేన ప్లీనరీ.. ఆ మూడు రోజులు పండగే!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో జనసేన పార్టీ(Janasena Party) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు ప్లీనరీ(Plenary) నిర్వహిస్తున్నట్లు జనసేన తెలిపింది. ఈ నేపథ్యంలో మార్చి 12, 13, 14 తేదీల్లో పిఠాపురంలో ఈ ప్లీనరి నిర్వహిస్తారు. అయితే ఈ ప్లీనరీ(Plenary) నిర్వహణ పై మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) ఆధ్వర్యంలో కోర్ కమిటీ ఏర్పాటు కానుంది. ఈ సమావేశాలకు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్(AP Deputy CM Pawan Kalyan) చీఫ్ గెస్ట్‌గా హాజరవుతారు. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగే తొలి ప్లీనరీకి రాష్ట్రం నలుమూలల నుంచి జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులతో పాటు ముఖ్యమైన కార్యకర్తలు వచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లను చేయాలని.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే నేతలకు, కార్యకర్తలకు అవసరమైన వసతి, భోజన సదుపాయాలు కల్పించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed