- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సికింద్రాబాద్ బోనాల జాతర ఏర్పాట్లు పకడ్బందిగా జరగాలి : కలెక్టర్
దిశ,బేగంపేట : ఈ నెల 21,22 వ తేదీలలో జరుగనున్న సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. బుధవారం మహంకాళి దేవాలయానికి వచ్చిన కలెక్టర్ ఆర్డీవో దశరథ్ సింగ్ , తహసీల్దార్ పాండు నాయక్, జీహెచ్ఎంసీ డీసీ సమ్మయ్య, ఈవో మనోహర్ రెడ్డి .. ఏసీపీ సర్దార్ సింగ్, ఇన్స్పెక్టర్ పరశురాం తదితర అధికారులతో కలిసి దేవాలయం పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్ల గురించి పరిశీలించి క్యూ లైన్లు, మంచినీళ్లు, పారిశుధ్యం, టాయిలెట్ల నిర్వహణపై ఎలాంటి అలసత్వం వహించకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిరంతరం విద్యుత్ సరఫరా జరిగేలా ఏర్పాట్లు చేసుకోవాలని దేవాలయం పరిసర ప్రాంతాల్లో వీధి దీపాలు వెలిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు నిరంతరం పర్యవేక్షించాలని కోరారు.