నీలోఫర్ ఆసుపత్రిలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు

by Sridhar Babu |
నీలోఫర్ ఆసుపత్రిలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు
X

దిశ,కార్వాన్ : రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. నీలోఫర్ ఆసుపత్రిలో గత మూడు రోజులుగా మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం 51 శాంపిల్స్ టెస్ట్ కోసం పంపగా అందులో ఆరు నెలల చిన్నారికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపారు. దీంతో అప్రమత్తంగా ఉండాలని రోగుల బంధువులకు వైద్యులు సూచించారు. భయపడాల్సిన అవసరం లేదని, నియమాలు పాటించాలని, ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలు కల్పించినట్లు డాక్టర్ల బృందం పేర్కొంది.

Advertisement

Next Story