నిలోఫర్ ఆసుపత్రిలో మరో కరోనా కేసు

by Sridhar Babu |
నిలోఫర్ ఆసుపత్రిలో మరో కరోనా కేసు
X

దిశ,కార్వాన్ : నిలోఫర్ ఆస్పత్రిలో మరో చిన్నారికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మంగళవారం ఆస్పత్రిలో మొత్తం 17 శాంపిల్స్ ను టెస్టింగ్ కోసం పంపగా, ఒకటి పాజిటివ్ గా వచ్చింది. చోటుప్పల్ కి చెందిన 9 నెలల చిన్నారికి బుధవారం కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్​ ఉషా రాణి వెల్లడించారు. నిలోఫర్ లో మూడు రోజుల్లో మూడు కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. కాగా దీంతో కలిపి మొత్తం నాలుగు కేసులు నమోదైనట్లు వైద్యులు పేర్కొన్నారు.

Advertisement

Next Story