- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నియామకాలన్నీ కవితకు అప్పగించాడనే అతడికి తొమ్మిదేళ్ల పదవి!
దిశ, డైనమిక్ బ్యూరో: సింగరేణి సీఎండీ శ్రీధర్ బదిలీపై మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. తొమ్మిదేళ్ల తర్వాత ఈ పెద్ద మనిషి సింగరేణి నుంచి పోయాడని, ఇతని హయాంలో అన్ని నియామకాల్లో అవినీతే జరిగిందని ఆరోపించారు. నియామకాలన్నీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు అప్పగించాడనే ప్రచారం సింగరేణిలో ఉందని, 471 క్లర్క్ నియామకాలలో 60 కుటుంబాల నుంచి ఇద్దరిద్దరు 120 మంది నియమింపబడ్డారని ఆరోపించారు. క్లియర్ గా పేపర్ల లీకేజ్ కి పాల్పడ్డారని, అందువల్లే సీఎండీగా ఇన్నేళ్లు ప్రభుత్వం శ్రీధర్ ను కొనసాగించిందని ఆరోపించారు. 1997 బ్యాచ్ కు చెందిన శ్రీధర్ ను ప్రభుత్వం 2015 నుంచి సింగరేణి సీఎండీగా కొనసాగిస్తోంది.
గతంలో శ్రీధర్ పదవీ కాలాన్ని పొడిగించడాన్ని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ పలు దఫాలుగా అభ్యంతరాలు వ్యక్తం చేసినా సీఎం కేసీఆర్ మాత్రం ఆయన్నే పదవిలో కొనసాగిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆయనపై సింగరేణి కార్మిక సంఘాలతోపాటు ప్రతిపక్షాల వైపు నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం తెరపైకి రావడంతో సింగరేణి నియామకాలోనూ అవకతవకలు జరిగాయనే ప్రచారం కూడా జోరుగా వినిపిస్తోంది. ఈ క్రమంలో శ్రీధర్ బాబు బదిలీ కావడం హాట్ టాపిక్ గా మారింది. సింగరేణి సీఎండీ పదవి నుంచి ఆయన నేషనల్ మినరల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా నియామకం అయ్యారు.