- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి : ఏఐఎస్ఎఫ్
దిశ ప్రతినిధి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీలో పరీక్ష పత్రాల లీకేజీ పై హైకోర్ట్ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. శుక్రవారం ప్రగతి భవన్ ముట్టడి చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు చైతన్య యాదవ్ మాట్లాడుతూ.. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న టీఎస్పీఎస్సీ ఛైర్మెన్‌ని బర్తరఫ్ చేసి బోర్డును ప్రక్షాళన చేయాలన్నారు.
తెలంగాణ ఉద్యమ నినాదం అయినటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంపై తెలంగాణ ఉద్యమ పోరాటంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించి రాష్ట్రాన్ని సాధించుకున్నారని అన్నారు. ఆనాటి విద్యార్థులే నేటి నిరుద్యోగులని, ప్రశ్నపత్రాల లీకేజి వలన 30 లక్షల మంది నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. లీకేజీ ఘటనపై హై కోర్ట్ సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏఐఎస్ఎఫ్ నాయకులను అరెస్టు చేసి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.