హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ దగ్గర ఏబీవీపీ ఆందోళన

by Mahesh |
హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ దగ్గర ఏబీవీపీ ఆందోళన
X

దిశ, కార్వాన్: హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ లోని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ దగ్గర రాష్ట్ర ఏబీవీపీ సభ్యులు హరి ప్రసాద్ కార్యకర్తలతో కలిసి గురువారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా హరి ప్రసాద్ మాట్లాడుతూ.. శ్రీనిధి, గురునానక్ యూనివర్సిటీ గుర్తింపును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అర్హత లేకుండా అడ్మిషన్స్ తీసుకుంటూ యూనివర్సిటీకి ఉండవలసిన నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. లక్షల్లో విద్యార్థుల దగ్గర ఫీజులు తీసుకుని వారి భవిష్యత్ ఆగం చేశారని మండిపడ్డారు. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ముందు బైఠాయించి ఆందోళన చేస్తున్న ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి తరలించారు.

Advertisement

Next Story

Most Viewed