- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆహార మార్పులతో అద్భుత జీవనం సాధ్యమే!
దిశ, హిమాయత్ నగర్ : ఫిజీషియన్స్ అసోసియేషన్ ఫర్ న్యూట్రిషన్ (పాన్ ) ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాదులోని హయత్ ప్యాలెస్ 29వ ఇన్-పర్సన్ కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ (సీఎంఈ) కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆహార పోషకాహార ప్రాధాన్యత, ముఖ్యంగా ప్లాంట్ బేస్డ్ డైయెట్స్ ద్వారా నాన్-కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్సీడీఎస్) నిర్వహణపై చర్చించడానికి వైద్య నిపుణులు, పోషకాహార నిపుణులను ఒక వేదికపైకి తెచ్చింది. ఈ సదస్సులో డా.హేమలత, మెడికల్ డైరెక్టర్ డా. రజీన షహిన్, డా. ప్రత్యుష నెరెళ్ల వంటి వైద్య నిపుణులు ప్రజెంట్ చేసిన ఆధునిక రిసెర్చ్ ఫలితాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని పలువురు డాక్టర్స్ తెలిపారు. డా. రాజేందర్ రామగిరి ఆధ్వర్యంలో డయాబెటిస్ రిమిషన్‌పై కేస్ ప్రెజెంటేషన్, జీవన శైలిలో మార్పులతో వచ్చిన అద్భుత ఫలితాలను వివరించారు. ఐబీడీ, శోగ్రెన్ సిండ్రోమ్ నుండి రిమిషన్ సాధించిన మూడు రోగుల కేస్ స్టడీ, పోషకాహారం ద్వారా సాధించిన ఫలితాలను తెలిపారు. డా. సుందీప్ లక్టాకియా మోడరేట్ చేసిన ప్యానెల్ డిస్కషన్, వైద్య రంగంలో పోషకాహారం సమగ్రతపై చర్చించారు. ఈ సీఎంఈ ప్రోగ్రామ్ పాన్ ఇండియా లక్ష్యమైన ఆహార సంబంధిత వ్యాధులను నివారించి, పర్యావరణ అనుకూల ఆరోగ్య పరిష్కారాలను ప్రోత్సహించే దిశగా మరొక మైలురాయిగా నిలుస్తుందని పలువురు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు.