rave party : హైటెక్ సిటీ నడిబొడ్డున రేవ్ పార్టీ..

by Sumithra |
rave party : హైటెక్ సిటీ నడిబొడ్డున రేవ్ పార్టీ..
X

దిశ, శేరిలింగంపల్లి : ఇన్నాళ్లు నగర శివారులకు, ఫార్మ్ హౌస్ లకు పరిమితమైన రేవ్ పార్టీలు ఇప్పుడు నగరం నడిబొడ్డున నిర్వహిస్తున్నారు. ఏకంగా మాదాపూర్ హైటెక్ సిటీ సైబర్ టవర్స్ వద్ద నిర్వహించిన రేవ్ పార్టీని రంగారెడ్డి జిల్లా ఎస్టీఎఫ్ పోలీసులు భగ్నం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆబ్కారీ అధికారులు గురువారం మీడియాకు తెలిపారు.

బేగంపేట్ కు చెందిన నాగరాజు యాదవ్ జన్మదినం పురస్కరించుకొని తన మిత్రుల కోసం మాదాపూర్ సైబర్ టవర్స్ వద్ద ఉన్న క్లౌడ్ 9 హోమ్స్ సర్వీస్ అపార్ట్మెంట్ లో రేవ్ పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ పార్టీలో 14 మంది యువకులు, 6 గురు యువతులు పాల్గొన్నారు. రేవ్ పార్టీ కోసం గోవా నుంచి డ్రగ్స్, విదేశీ మద్యం తీసుకువచ్చారు. ఎస్టీఎఫ్, ఆబ్కారీ అధికారులు పక్కా సమాచారంతో రేవ్ పార్టీ నిర్వహిస్తున్న అపార్ట్మెంట్ పై దాడి చేశారు.

రేవ్ పార్టీలో పట్టుబడ్డ వారి నుంచి మొత్తం 1.25 లక్షల నగదు విలువ చేసే విదేశీ మద్యం, 1 గ్రాము కొకైన్, 2 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్, 0.68 గ్రాముల ఓజీ కుష్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఇన్నోవా క్రిస్ట వాహనం సీజ్ చేశారు.

Advertisement

Next Story