తెలంగాణ శివసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కీలక నేత

by Ramesh N |
తెలంగాణ శివసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కీలక నేత
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ శివసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జి సుధాకర్‌కు శివసేన స్టేట్ చీఫ్ సింకారు శివాజీ ఇవాళ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో శివసేన స్టేట్ చీఫ్ శివాజీ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, కుల, ప్రజా సంఘాలు శివసేన పార్టీలో చేరి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పైన ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేసి పోరాటం చేస్తామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన ఉద్యమకారులకు తగిన గుర్తింపు ఇచ్చేందుకు శివసేన పార్టీ సిద్ధంగా ఉందని అన్నారు.

శివసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన జి సుధాకర్ మాట్లాడుతూ.. గత 25 ఏళ్లుగా ప్రజా సంఘాల్లో కీలకంగా పని చేశానని తెలిపారు. అదే విధంగా తెలంగాణ ఉద్యమంలో కూడా కీలకంగా పని చేశానన్నారు. శివసేన పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు శివాజీ సారధ్యంలో రాష్ట్రంలో గల్లీ నుంచి రాష్ట్ర రాజధాని వరకు పార్టీ బలంగా చేసేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పారు. ప్రజా సంఘాల్లో పని చేస్తున్న వారు శివసేన పార్టీలో పని చేసేందుకు ముందుకు రావాలని విజ్ఙప్తి చేశారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి క్రియాశీలకంగా దేశం కోసం, ధర్మం కోసం ప్రజా సమస్యల సాధన కోసం ఎల్లప్పుడు పని చేసేందుకు ఉంటానని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed