- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భార్యను కడతేర్చిన భర్త
దిశ, మియాపూర్ : కట్టుకున్న భార్యని రాయితో మోది ఆపై అతి కిరాతకంగా కత్తి తో పొడిచి చంపిన ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. చందానగర్ సీఐ క్యాస్త్రో తెలిపిన వివరాల ప్రకారం చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్లగండ్లలో నివాసముంటున్న తాండూరుకు చెందిన అంబిక (27) నరేందర్ లు నివాసం ఉంటున్నారు. కాగా అంబిక , నరేందర్ లు స్కూల్ లో చదువుతున్న క్రమంలోనే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయిన కొత్తలో వీరి కాపురం బాగానే ఉంది. నరేందర్ ఏపనీ చేయకుండా తాగుడుకు బానిస అయి జులాయిగా తిరుగుతున్నాడు.
భర్త ఎంతకీ మారకపోవడం తో ఐదేళ్ల క్రితం కూతురును తీసుకొని అంబిక నళ్లగండ్ల కు బతుకు దెరువు కోసం వచ్చింది. ఇటీవల కాలంలో మళ్లీ కలిసి జీవనం సాగిద్దామని నరేందర్ వేధిస్తున్నాడు. అయితే ఎంతకీ అంబిక నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 11.40 సమయంలో శ్వాస్ బోటిక్ షాప్ క్లీనింగ్ చేస్తున్న సమయంలో అంబిక వద్దకు నరేందర్ వచ్చి బండరాయితో తలపై మోదాడు. ఈ క్రమంలో తేరుకున్న అంబిక తప్పించుకునేందుకు పరిగెత్తడంతో వెంటపడి కత్తితో అతి దారుణంగా మెడపై నరికి హత్య చేశాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.