పబ్‌లో యువతి కోసం యువకుల మధ్య ఘర్షణ.. చివరకు ఎటు దారి తీసిందంటే?

by Disha Web Desk 9 |
పబ్‌లో యువతి కోసం యువకుల మధ్య ఘర్షణ.. చివరకు ఎటు దారి తీసిందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ ఫిలింనగర్‌లోని మూన్ షైన్ పబ్‌లో శనివారం రాత్రి ముందుబాబుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. అప్పటికే ఫుల్‌గా తాగి ఉన్న యువకులు ఓ యువతి విషయంలో కొట్టుకోవడం ఫిలింనగర్‌లో పెద్ద దుమారమే రేపింది. యువకుడు, యువతితో డ్యాన్స్ చేస్తుండగా కొందరు యువకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వారి మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ దాడిలో ముగ్గురికి గాయాలవ్వగా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు హైదరాబాదులోని ఫిలింగనర్ లోని మూన్‌షైన్ పబ్ కు చేరుకుని నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed