- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాంగ్ రూట్‌లో ప్రయాణించారో ఇకపై ట్రాఫిక్ చల్లాన్ కాదు.. ఆ సెక్షన్ కింద కేసు నమోదు
దిశ, క్రైమ్ బ్యూరో: వాహనదారులు మీకో బ్యాడ్ న్యూస్. మీరు ఇక రోడ్లఫై రాంగ్ రూట్‌లో ప్రయాణించారో మీ మీద కేసు పక్కా. చల్లాన్ కాదు.. ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఇక ఐపీసీ 336 కింద కేసు నమోదు చేస్తామని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్‌లు హెచ్చరిస్తున్నారు. దీంతో రాంగ్ రూట్‌లో వెళ్తే ఏం కాదని లైట్ తీసుకుంటే మాత్రం మీ మీద ఐపీసీ 336 కింద కేసు నమోదవ్వడం ఖాయమంటున్నారు పోలీస్‌లు. శుక్రవారం మియాపూర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో రాంగ్ రూట్‌లో ప్రయాణించిన 23 వగహనదారులు, ఓ వాటర్ టాంకర్ డ్రైవర్ మీద స్థానిక పోలీస్ స్టేషన్‌లో 336 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి అభియోగాలను నమోదు చేశారు. 336 అంటే మీరు రాంగ్ రూట్‌లో ప్రయాణించడం వల్ల ఎదుటి వారికి ప్రమాదం అండ్ ప్రాణహాని అని తెలిసి కూడా తప్పు చేయడం.. ఈ సెక్షన్ కింద అభియోగం నిరూపణ అయ్యితే 3 నెలలు జైలు ఉంటుందని పోలీస్‌లు చెప్పారు. ఈ రాంగ్ రూట్ ప్రమాదంలో ఎవరైనా మరణించిన, ఇంకా ఏమైనా పెద్ద ప్రమాదం జరిగినా వాటికి 336 తో పాటు మరికొన్ని ఐపీసీ సెక్షన్‌లను జత చేస్తారు.