Application : సాఫ్ట్‌వేర్ కోర్సులకు 80 శాతం రాయితీ

by Sridhar Babu |
Application : సాఫ్ట్‌వేర్  కోర్సులకు 80 శాతం రాయితీ
X

దిశ, హిమాయత్ నగర్ : నేషనల్ స్కిల్ అకాడమీ, హైదరాబాద్, భారత ప్రభుత్వ ఆమోదిత కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ కోర్సులకు 80 శాతం రాయితీతో ఆన్‌లైన్ శిక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆన్‌లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇంటర్, 10+2 , డిగ్రీ, ఇంజనీరింగ్, డిప్లొమా, పీజీ కోర్సులు చదువుతున్న, పూర్తి చేసిన విద్యార్థులకు సరికొత్త కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీలలో వారి నైపుణ్యాలను పెంచుకోవడానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తోందని ప్రోగ్రాం కోఆర్డినేటర్ సాయి శ్రీమాన్ రెడ్డి మంగళవారం పేర్కొన్నారు. శిక్షణ, సర్టిఫికేషన్, ఈ-లెర్నింగ్ ద్వారా

ఆన్‌లైన్‌లో శిక్షణ అందిస్తారని, తర్వాత పరీక్షలను నిర్వహిస్తారని, విజయవంతమైన అభ్యర్థులు భారత ప్రభుత్వం ఆమోదించిన సర్టిఫికెట్‌ను అందుకుంటారని తెలిపారు. కోర్సు వ్యవధి 2 నెలల నుండి ఆరు నెలలు వరకు ఉంటుందని, వివిధ సాఫ్ట్వేర్ సబ్జెక్ట్‌లో ఇన్‌ డెప్త్ నాల్డెజ్ పొందేందుకు ఇది చక్కటి అవకాశంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు www.nationalskillacademy.in లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు 9505800050, 9505800047 నంబర్‌లను సంప్రదించవచ్చని ప్రోగ్రాం కోఆర్డినేటర్ సాయి శ్రీమాన్ రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story