వైస్ ఛాన్స్​లర్ పోస్టుల్లో 50 శాతం బీసీలను నియమించాలి

by Sridhar Babu |
వైస్ ఛాన్స్​లర్ పోస్టుల్లో 50 శాతం బీసీలను నియమించాలి
X

దిశ, హిమాయత్‌నగర్‌ : త్వరలో నియమించబోయే వైస్ ఛాన్స్​లర్ పోస్టులను బీసీలకు 50 శాతం కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. అదేవిధంగా నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం కోటా ఇవ్వాలన్నారు. ఈ మేరకు శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, అనంతయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ ప్రస్తుతం జరగబోయే యూనివర్సిటీ వైస్ ఛాన్స్​లర్ నియామకాలలో బీసీలకు 50 శాతం పోస్టులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమైన జేఎన్ టీయూహెచ్, పాలమూరు, ఉస్మానియా, శాతవాహన యూనివర్సిటీలలో పోస్టులను బీసీలకు కేటాయించి, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిలర్ చైర్మన్ కూడా బీసీలకు కేటాయించాలని అన్నారు. యూనివర్సిటీలలో దాదాపు 2400 ప్రొఫెసర్ పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయని, వాటిని వెంటనే భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది 100 బీసీ గురుకుల పాఠశాలలు, 50 ఇంజనీరింగ్ కాలేజీలు, రెండు యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలన్నారు. కాలేజీ కోర్సులు చదివే బీసీ విద్యార్థుర్ధులకు పూర్తి ఫీజులు ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో నీల వెంకటేష్, గరిగే మల్లేష్, కోట్ల శ్రీనివాస్, రాజ్ కుమార్, మోడీ రామ్ దేవ్, శివ, జి.అనంతయ్య, సి.రాజేందర్ పాల్గొన్నారు.

Next Story

Most Viewed