ఉప్పల్ మున్సిపల్ పరిధిలో అడ్డగోలుగా అక్రమ కట్టడాలు

by Kalyani |
ఉప్పల్ మున్సిపల్ పరిధిలో అడ్డగోలుగా అక్రమ కట్టడాలు
X

దిశ, ఉప్పల్: ఉప్పల్ మున్సిపల్ పరిధిలో అధికారుల అండదండలతో అడ్డు అదుపు లేకుండా అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. రామంతాపూర్ ఇందిరానగర్ లో ప్రస్తుత కార్పొరేటర్ ఇంటి ముందు నిర్వాహకులు నిబంధనలు పట్టించుకోకుండా మమ్మల్ని అడిగేదేవరు....ఆపేదెవరు అన్నట్టుగా స్టిల్ట్ ప్లస్ టు పర్మిషన్ తీసుకోని కట్టడాలు మరోలా నిర్మిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు ఆప్రూవల్ ఇచ్చిన తరువాత ఆ బిల్డింగ్ ఏ విధంగా కడుతున్నారు. ఎన్ని అంతస్తులు వేస్తున్నారని పర్యవేక్షణ చేయాలి.

రెసిడెన్సియల్ పేరుతో పర్మిషన్ తీసుకుని కమర్షియల్‌ నిర్మాణం పెద్దపెద్ద బిల్డింగ్‌లు,షెడ్లు, అపార్టమెంట్లు అయితే నిబంధనలకు విరుద్దంగా నిర్మిస్తున్నప్పటికీ తమ ముడుపులు తమకు ముడితే చాలు వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక టౌన్ ప్లానింగ్ అధికారుల హస్తం ఉందని ప్రజలు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.అంతే కాకుండా ఉప్పల్ నుంచి రామంతపూర్ వెళ్లే ప్రధాన రహదారిలో హబ్సిగూడ స్ట్రీట్ 8 సిగ్నల్ దగ్గర అక్రమ నిర్మాణ షెడ్డు నిర్మాణం జరుగుతున్న కూడా జిహెచ్ఎంసి అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఇన్ని అక్రమాలు జరుగుతున్న కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు కనీసం అటువైపు కన్నెత్తి చూడడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా డిప్యూటీ కమిషనర్ స్పందించి ఉప్పల్ మున్సిపాలిటి పరిధిలో విచ్చలవిడిగా జరుగుతున్న అక్రమ నిర్మాణలపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

నోటీసులకే పరిమితమైన అధికారులు

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ మున్సిపల్ పరిధిలో రామంతాపూర్ డివిజన్ అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారింది. అనుమతులకు విరుద్ధంగా నిర్మిస్తున్న అక్రమ కట్టడాలపై స్థానిక ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేస్తే టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారే తప్ప అక్రమ కట్టడాలను కూల్చిన దాఖలాలే లేవని స్థానికులు మండిపడుతున్నారు.

అక్రమాలపై పర్యవేక్షణ కరువు...

ఉప్పల్ మున్సిపల్ పరిధిలో అనేక డివిజన్ల పరిధిలో చేపట్టిన అనుమతి లేని నిర్మాణాలపై పర్యవేక్షణ చేసి చర్యలు తీసుకోవాల్సిన టీపీవో అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నయని ప్రజల నుంచి ఆరోపణలు వస్తున్నాయి.

ఉప్పల్ జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ ఆంజనేయులు వివరణ

ఉప్పల్ జిహెచ్ఎంసి పరిధిలో ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఉపేక్షించేది లేదని ఉప్పల్ జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ ఆంజనేయులు పేర్కొన్నారు. అనుమతులకు విరుద్ధంగా బిల్డింగ్లు,షెడ్ల నిర్మాణాలు చేపట్టితే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Next Story

Most Viewed