తునికాకు కూలీల బోనస్ పక్కదారి.. ఇద్దరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌లు సస్పెండ్

by Aamani |
తునికాకు కూలీల బోనస్ పక్కదారి.. ఇద్దరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌లు సస్పెండ్
X

దిశ,ప్రతినిధి వికారాబాద్ : వికారాబాద్ జిల్లా పరిధిలోని వికారాబాద్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అరుణ, తాండూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్యామ్ సుందర్ ను సస్పెండ్ చేస్తూ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ ఉన్నత అధికారి ఆర్.ఎమ్ దొబ్రియాల్ ఐఎఫ్ఎస్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే గత 2017 సంవత్సరంలో జిల్లా నుండి అధిక మొత్తంలో తునికాకు సేకరణ జరిగింది. దీనికరణంగా అటవీశాఖకు వచ్చిన లాభాల నుండి తునికాకు రైతులకు బోనస్ ఇవ్వాలని అటవీ శాఖ నిర్ణయించింది.

అందుకు సంబంధించిన కూలీల బ్యాంకు వివరాలు పంపమని ఉన్నత అధికారులు కోరగా, వికారాబాద్, తాండూర్ ఫారెస్ట్ రేంజ్ అధికారులు అయినా అరుణ, శ్యామ్ సుందర్ లు తమ అనుచరుల బ్యాంకు వివరాలు పంపించి దాదాపు రూ.18 లక్షల పైనే కూలీల బోనస్ డబ్బులు తప్పుదోవ పట్టించారు. వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్త కథనాల ఆధారంగా గత జూన్ నెల 3వ తేదీన హైదరాబాద్ విజిలెన్స్ డిఎఫ్ఓ రాజశేఖర్ వికారాబాద్ జిల్లా కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. పూర్తి విచారణ అనంతరం నిధుల దుర్వినియోగంతో ముఖ్య పాత్ర వహించిన వికారాబాద్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అరుణ, తాండూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్యామ్ సుందర్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Next Story

Most Viewed