- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓయూలో 2కె రన్
దిశ, సికింద్రాబాద్: భగత్ సింగ్ యూత్ ఫెస్టివల్స్ లో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ ఆధ్వర్యంలో ఆదివారం డ్రగ్స్ కు వ్యతిరేకంగా సే నో టూ డ్రగ్స్ అనే నినాదంతో 2కె రన్ నిర్వహించారు. ఈ రన్ ఓయూ ఎన్ సీసీ గేట్ నుండి ఆర్ట్స్ కళాశాల వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు సీనియర్ అడ్వకేట్ విద్యాసాగర్, డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి మూర్తి ముఖ్య అతిధులుగా పాల్గొని రన్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు యువత డ్రగ్స్ కు బానిసై తమ ప్రాణాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని నిర్మూలించాల్సిన బాధ్యత ప్రతీ పౌరునిపై, ప్రభుత్వాలపైన ఉందన్నారు. భగత్ సింగ్ కలలు కన్న యువతరం ఇది కాదని, అయన ఆశయాలను ప్రతీ యువకుడు ముందుకు తీసుకుపోవలని పిలుపునిచ్చారు. మార్చి 23న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే భగత్ సింగ్ యువజన ఉత్సవాలకు యువత, విద్యార్థులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఓయూ కార్యదర్శి రవి నాయక్, ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి అశోక్ రెడ్డి, డీవైఎఫ్ఐ కార్యదర్శి జావీద్, నాయకులు రామాటేంకి శ్రీను, సాయికిరణ్, ఆనంద్ శర్మ, కృష్ణ, రమ్య, సృజన, నాగేశ్వరి, నవ్య రెడ్డి, మలోతు శ్రీమను, సందీప్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.