Baba Siddique: కూలీని పావుగా వాడుకొని హత్య.. బాబాసిద్దిఖీ మర్డర్ కేసులో బయటకొస్తున్న సంచలనాలు

by Shamantha N |
Baba Siddique: కూలీని పావుగా వాడుకొని హత్య.. బాబాసిద్దిఖీ మర్డర్ కేసులో బయటకొస్తున్న సంచలనాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యే బాబా సిద్దిఖీ హత్య(Baba Siddique Murder Case) కేసు విచారణలో సంచలనాలు బయటకొస్తున్నాయి. నిందితులు ఎలాంటి ఆధారాలు దొరకకుండా పక్కా ప్లానింగ్ తో వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో కీలక నిందితుడు ఆకాశ్‌దీప్‌ గిల్‌ను పోలీసులు విచారించగా కీలక విషయాలు బయటకొచ్చాయి. ఓ వ్యవసాయ కూలీని పావుగా వాడుకొని లార్సెన్‌ సోదరుడితో తాను మాట్లాడినట్లు నిందితుడు పోలీసులకు తెలిపాడు. తన పొలంలో పనిచేసే బల్వీందర్‌ అనే కూలీ ఫోన్‌లోని హాట్‌ స్పాట్‌ ద్వారా మొబైల్‌ ఇంటర్నెట్‌ను వాడుకొని హత్య కేసులో సూత్రధారి అన్మోల్‌ బిష్ణోయ్‌తో మాట్లాడినట్లు తేలింది. దీంతోపాటు మిగిలిన నిందితులైన శుభం లోంకర్‌, జీషాన్‌ అక్తర్‌, షూటర్‌ శివమ్‌కుమార్‌ గౌతమ్‌లతో చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. వ్యవసాయ కూలీ హాట్‌స్పాట్‌ కావడంతో తన లొకేషన్‌ పోలీసుల దృష్టిలోపడకుండా ఆకాశ్‌దీప్‌ జాగ్రత్త పడినట్లు వెల్లడించారు. కాగా.. నవంబర్‌ 16న పంజాబ్‌లోని ఫజ్లికాలో పోలీసులు అరెస్టు చేశారు. అయితే, గిల్ ఫోన్‌ను ఫ్లైట్‌ మోడ్‌లో పెట్టి.. బల్వీందర్‌ నుంచి హాట్‌స్పాట్‌ తీసుకొని వాడుకొన్నట్లు గుర్తించారు. కాగా.. గిల్ మొబైల్‌ ఫోన్‌ కోసం ఇప్పుడు తీవ్రస్థాయిలో గాలింపు చేపట్టారు. దానిలో మరింత సమాచారం ఉండొచ్చని భావిస్తున్నారు.

సిద్దిఖీ మృతి

ఇకపోతే, బాబా సిద్దిఖీ హత్య కేసులో ఇప్పటివరకు 24 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో గిల్‌, నిందితులకు లాజిస్టిక్స్ సరఫరా చేసినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా.. గిల్ పోలీస్‌ కస్టడీని ముంబై కోర్టు నవంబర్‌ 23 వరకు పొడిగించింది. నిందితులు వాడిన గన్ ని మాత్రం పోలీసులు ఇప్పటివరకు రికవరీ చేయలేదు. అక్టోబరు 12న ముంబైలోని బాబా సిద్ధిఖీ(Baba Siddique) తన కుమారుడి కార్యాలయంలో ఉండగా.. కొందరు దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయాడు.

Advertisement

Next Story

Most Viewed