KTR: రాహుల్ కు తెలియకుండానే ఒప్పందాలా ? : అదానీ వ్యవహారంపై కేటీఆర్ విమర్శలు

by Rani Yarlagadda |   ( Updated:2024-11-22 09:19:04.0  )
KTR: రాహుల్ కు తెలియకుండానే ఒప్పందాలా ? : అదానీ వ్యవహారంపై కేటీఆర్ విమర్శలు
X

దిశ, వెబ్ డెస్క్: గౌతమ్ అదానీ (Gautam Adani) విషయంపై బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) సీరియస్ అయ్యారు. శుక్రవారం తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. మహారాష్ట్రలో అదానీని గజదొంగ అన్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy).. ఇక్కడ ఆయనకు గజమాల వేసి స్వాగతం పలికారని, అదానీకి రెడ్ కార్పెట్ వేస్తున్నారని దుయ్యబట్టారు. మంత్రివర్గ విస్తరణకే పర్మిషన్ ఇవ్వని హై కమాండ్ కు.. అదానీ ఒప్పందాల గురించి తెలియవా? రాహుల్ గాంధీకి తెలియకుండానే తెలంగాణలో అదానీతో ఒప్పందాలు జరిగాయా? రోజూ అదానీపై విమర్శలు చేస్తున్న రాహు.. తెలంగాణలో పెట్టుబడులను సమర్థిస్తున్నారా? అని మీడియా ముఖంగా ప్రశ్నించారు.

బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో అదానీకి అవకాశం ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో రూ.12,400 కోట్ల ఒప్పందం చేసుకున్నారన్నారు. బడేభాయ్ ఆదేశాలను చోటేభాయ్ అమలు చేశారని విమర్శించారు. కాంగ్రెస్ తీరు ఢిల్లీలో ఒక నీతి, గల్లీలో మరో నీతి అన్నట్లు ఉందన్నారు. హైదరాబాద్ లో ఉన్న కోహినూర్ హోటల్ (Kohinoor) లో పొంగులేటి, అదానీ రహస్యంగా సమావేశమయ్యారని, అలాగే.. సీఎం ఇంటిలోనూ 4 గంటలపాటు అదానీ చర్చలు జరిపారని ఆరోపించారు. రాష్ట్రానికి చెందిన విద్యుత్ సంస్థలను అదానీకి అప్పగించే ప్రయత్నం జరిగిందని, ఓల్డ్ సిటీలో ఈ మేరకు పైలట్ ప్రాజెక్ట్ అమలు చేయబోయారని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. స్కిల్ వర్సిటీకి అదానీ రూ.100 కోట్లు ఇచ్చారని, ఇవన్నీ కుట్రలో భాగంగానే జరిగాయన్నారు.

Advertisement

Next Story

Most Viewed