- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Olive benefits : ఔషధ గుణాల ఆలివ్.. ఇది తెలిస్తే అస్సలు వదలరు!
దిశ, ఫీచర్స్ : ఆలివ్ పండ్లు.. ప్రస్తుతం వీటి గురించి తెలియనివారు దాదాపు ఉండరు. ఆరోగ్యానికి చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెప్తుంటారు. అందుకే చాలా మంది వీటిని తినడానికి ఇష్టపడుతుంటారు. ఉప్పు, కారం దట్టించి తింటే ఆలివ్ టేస్టే వేరు భయ్యా..! అంటుంటారు కొందరు. ఇక ఎవరు తినొచ్చు..? ఎవరు తినకూడదు? అని కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. అన్ని వయస్సుల వారు వీటిని తినొచ్చు. పైగా ఔషధాల ఫలం. అయితే ఇందులో ఏయే పోషకాలుంటాయి? ఎలాంటి ప్రయోజనాలు చేకూరుస్తాయో ఇప్పుడు చూద్దాం.
*ఆలివ్‌లో ఒలిక్ యాసిడ్, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఫుల్లుగా ఉంటాయి. కాబట్టి వీటిని తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అలాగే ఆలివ్ ఆయిల్ తరచుగా యూజ్ చేయడంవల్ల ఎముకల దృఢంగా ఉంటాయని చెప్తారు. చర్మ సౌందర్యాన్ని పెంచడంలో, ముఖాన్ని కాంతివంతంగా మార్చడంలో ఆలివ్ పండ్లలోని పోషకాలు కీ రోల్ పోషిస్తాయి.
* ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉండటంవల్ల ఆలివ్ పండ్లు మలబద్ధకాన్ని, అజీర్తి వంటి సమస్యలను నివారిస్తాయి. జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. వీటిలోని మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. మంచి కొలెస్ట్రాల్‌ను సంరక్షిస్తాయి. అధిక బరువును నియంత్రిస్తాయి. అట్లనే ఆలివ్‌లోని సమ్మేళనాలు బాడీలో మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఆరోగ్యానికి మంచిదని ఆలివ్ పండ్లను ఎక్కువగా తినడం, నూనెను అధికంగా యూజ్ చేయడం కూడా అంత మంచిది కాదు. ఉప్పు ఎక్కువగా కలిపి తినడంవల్ల రక్తపోటును పెంచుతాయి. కాబట్టి మితంగా తినాలి.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.