హైటెక్స్ లో ప్రారంభమైన 17వ ఈవీ ఎక్స్ పో

by Sridhar Babu |   ( Updated:2023-02-08 12:26:50.0  )
హైటెక్స్ లో ప్రారంభమైన 17వ ఈవీ ఎక్స్ పో
X

దిశ, శేరిలింగంపల్లి : రానున్న కాలం అంతా ఎలక్ట్రికల్ వాహనాలదేనని, ఇప్పుడు వాటికే డిమాండ్ ఉంటుందని ఎలక్ట్రిక్ వెహికల్ కమిటీ చైర్మన్, ఈవీ ఎక్స్‌పో వ్యవస్థాపకుడు అనూజ్ శర్మ అన్నారు. 17వ ఈవీ ఎక్స్‌పో 2023 బుధవారం భారతదేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల వాణిజ్య ప్రదర్శన నగరంలోని హైటెక్స్‌లో ప్రారంభమైంది. మూడు రోజుల ఈ ప్రదర్శన ఈనెల 10 వరకు కొనసాగనుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తన పూర్తి మద్దతు ఇస్తుంది. తెలంగాణ రోడ్డు రవాణా అండ్ రహదారుల మంత్రిత్వ శాఖ, భారతదేశ ప్రభుత్వం, ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీలు సంయుక్తంగా ఈ ఎక్స్ పోను నిర్వహిస్తున్నాయి. ఈ ఎక్స్‌పోలో 40 స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఇవి సాంకేతికంగా అభివృద్ధి చెందిన, కాలుష్య రహిత 2,3,4 చక్రాల ఇ-రిక్షాలు, ఇ-కార్ట్‌లు, ఇ-బైక్‌లు, ఇ-స్కూటర్లు, ఇ-సైకిళ్లు, ఇ-లోడర్‌లు వంటి వాటిని ప్రదర్శనకు ఉంచాయి. ఈవీ ఎక్స్ పో 2023లో 4 చక్రాల వాహనాలు, సరికొత్త లిథియం-అయాన్ బ్యాటరీలు, ఛార్జింగ్ సొల్యూషన్‌లు, వాహన భాగాలు, ఉపకరణాలు కూడా ఎక్స్‌పోలో ప్రదర్శించబడుతున్నాయి.

ఎలక్ట్రిక్ వెహికల్ కమిటీ చైర్మన్, ఈవీ ఎక్స్‌పో వ్యవస్థాపకుడు మాట్లాడుతూ భారతదేశంలోని మెజారిటీ వాహనాల్లో ఉపయోగించే హైడ్రోకార్బన్ ఆధారిత ఇంధనం యొక్క విస్తారమైన ఆవశ్యకత కారణంగా, ముడి చమురును దిగుమతి చేసుకోవడానికి మనము భారీ మొత్తంలో విదేశి మారకద్రవ్యాన్ని వెచ్చిస్తున్నామని, దీనిని తగ్గించడానికి ఎలక్ట్రిక్ వాహనాల తక్షణ అవసరం ఉందన్నారు. అదే సమయంలో వాతావరణం, అవసరాలకు అనుగుణంగా భారతదేశంలోని మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల పర్యావరణ వ్యవస్థను తీర్చడానికి స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. వినియోగదారులు ఈవీ సాంకేతికతను స్వీకరించడాన్ని పెంచేందుకు ప్రోత్సాహకాలను అందిస్తోందని, కొత్త చర్యలతో ముందుకు వస్తుందన్నారు. ఈ-వాహనాలు, బ్యాటరీలు, ఛార్జింగ్ స్టేషన్‌ల తయారీదారులు, అలాగే ఈవీ పర్యావరణ వ్యవస్థ సర్వీస్ ప్రొవైడర్లు తమ తాజా ఉత్పత్తులు, సేవలను ప్రదర్శించడానికి తాము ఈ ఎక్స్‌పోను నిర్వహిస్తున్నామన్నారు. అలాగే రెట్రోఫిటింగ్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉందని, అన్ని పాఠశాల బస్సులు, యూనివర్సిటీ బస్సులు రెట్రోఫిటింగ్ కోసం వెళ్లవచ్చని కోరారు. తెలంగాణలోని మల్లారెడ్డి గ్రూప్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌తో కూడా వారి వాహనాలన్నింటినీ రీట్రోఫిట్ చేసేందుకు చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవీ ఎక్స్ పో ఆర్గనైజర్ రాజీవ్ అరోరా, శిరీష్, అనుపమ్‌ లు పాలొగన్నారు.

Advertisement

Next Story

Most Viewed