- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చైల్డ్ పోర్నోగ్రఫీ కేసుల్లో హైదరాబాద్ టాప్
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: విశ్వనగరంగా చెప్పే హైదరాబాద్ చైల్డ్‌పోర్నోగ్రఫీ నేరాల్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ వీడియోలను చూడటానికి అలవాటు పడ్డవారిలో కొందరు వాట్సాప్ గ్రూపుల్లో షేర్చేస్తుండగా మరికొందరు వేర్వేరు సెర్చ్ఇంజన్ల నుంచి చైల్డ్పోర్నోగ్రఫీకి చెందిన వీడియోలను సేకరించి వేర్వేరు ప్లాట్‌ఫాంలలో అప్లోడ్ చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే ఈ వికృత చేష్టలకు పాల్పడుతున్న వారిలో ఎక్కువగా ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు ఉండటం. దీన్ని అరికట్టటానికి నోడల్ఏజెన్సీగా వ్యవహరిస్తున్న రాష్ర్ట సీఐడీ శాఖ అంతర్జాతీయ సంస్థలు, టిప్‌లైన్ ద్వారా అందుతున్న ఫిర్యాదులతో కేసులు నమోదు చేసి కొందరిని అరెస్టు చేస్తున్నా ఈ తరహా నేరాలు పెరిగుతూనే ఉన్నాయి. ఫలితంగా చిన్న వయసులోనే వీటిని చూడటానికి అలవాటు పడుతున్న వారు క్రమంగా మానసిక రోగులుగా మారుతున్నారు. ఇంకొందరు నేరాలకు పాల్పడుతున్నారు.
టెక్నాలజీ దుర్వినియోగం..
అరచేతిలోకి వచ్చేసిన ఆండ్రాయిడ్ ఫోన్లు, అందుబాటులోకి వచ్చిన ఇంటర్నెట్ సానుకూలంగా ఉపయోగించుకుంటున్న వారికి ప్రయోజనాలు కలిగిస్తుంటే దుర్వినియోగానికి వాడుతున్న వారిని తప్పుడు దారులు పట్టిస్తోంది. సైకాలజిస్ట్ అయిన డాక్టర్ గోపి చెప్పిన ప్రకారం మొబైల్ఫోన్లలో ఇంటర్నెట్ ను ఉపయోగించుకుంటున్నవారిలో 15 నుంచి 30 సంవత్సరాలలోపు వయసున్న వారే అధికంగా ఉన్నారు. వీళ్లల్లో చాలామంది పోర్న్సైట్లు చూడటం మొదలుపెట్టి కొన్నిరోజుల్లోనే దానికి బానిసలుగా మారుతున్నారు. వీరిలో కొందరు చూడటంతో ఆగక వేర్వేరు సైట్ల నుంచి చైల్డ్పోర్నోగ్రఫీకి చెందిన వీడియో క్లిప్పింగులను డౌన్లోడ్ చేసి తమ వాట్సాప్, టెలీగ్రాం గ్రూపుల్లో స్నేహితులకు షేర్ చేస్తున్నారు. దీనికి నిదర్శనంగా ఈ తరహా నేరానికి పాల్పడి అరెస్టయిన అంబర్‌పేట నివాసి శ్రీనివాస్ఉదంతాన్ని పేర్కొనవచ్చు. ఎంసీఏ విద్యార్థి అయిన శ్రీనివాస్ వేర్వేరు సైట్ల నుంచి అశ్లీల వీడియోలు డౌన్లోడ్ చేసి వాటిని షేర్ చేస్తూ చివరకు కటకటాల పాలయ్యాడు. ఆ తరువాత కొన్నిరోజులకే ఇంటర్నెట్లో చైల్డ్‌పోర్నోగ్రఫీ వీడియోల కోసం సెర్చ్ చేస్తూ కాచిగూడకు చెందిన ప్రశాంత్, తార్నాకకు చెందిన మహ్మద్ ఫిరోజ్ పోలీసుల చేతికి చిక్కిపోయారు.
నేరాల బాటలోకి..
చైల్డ్‌పోర్నోగ్రఫీ వీడియోలు చూడటానికి అలవాటు పడుతున్న వారిలో కొందరు నేరాలకు పాల్పడుతున్నారు. వీరిలో పదిహేనేళ్ల మైనర్లతోపాటు యాభై సంవత్సరాల వయసున్నవాళ్లూ ఉన్నారు. వీడియోల్లో చూసినట్టుగా వికృత వాంఛలను తీర్చుకోవటానికి చిన్నారులను బలి చేస్తున్నారు. దీనికి నిదర్శనంగా బోరబండ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి ఏడేళ్ల బాలునిపై వరుసగా కొన్నిరోజులపాటు లైంగిక దాడి చేయటాన్ని పేర్కొనవచ్చు. సదరు వ్యక్తి పెడుతున్న హింసను భరించలేకపోయిన బాధితుడు చివరకు తల్లిదండ్రులకు విషయం చెప్పటంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్నిరోజుల క్రితం హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇలా అశ్లీల వీడియోలు చూడటానికి అలవాటుపడ్డ ఐదుగురు 10వ తరగత విద్యార్థులు తమ సహ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇలా చెబుతూ పోతే ఎన్నో ఉదంతాలున్నాయి.
అరెస్టులు చేస్తున్నా..
ఈ తరహా నేరాలను అరికట్టటానికి రాష్ర్ట సీఐడీ శాఖ నోడల్ ఏజెన్సీగా పని చేస్తోంది. అంతర్జాతీయ సంస్థలతోపాటు టిప్‌లైన్ ద్వారా అందుతున్న సమాచారంతో కేసులు నమోదు చేసి నిందితులను అరెస్టు చేస్తోంది. సీఐడీకి చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపిన ప్రకారం జనవరి నుంచి నవంబర్ వరకు చైల్డ్పోర్నోగ్రఫీకి సంబంధించి 31 కేసులు నమోదయ్యాయి. వీటిలో 43మందిని అరెస్టు కూడా చేశారు. ఇంటర్నెట్లోకి వెళ్లి చైల్డ్పోర్నోగ్రఫీకి సంబంధించిన వీడియోల కోసం సెర్చ్ చేసినా, సోషల్‌మీడియాలో అప్లోడ్చేసినా అన్ని వివరాలు ఎన్సీఆర్బీలోని ప్రత్యేక వింగ్‌లో నమోదవుతాయని ఆయన తెలిపారు. దీంతోపాటు అమెరికాతోపాటు పలు దేశాల్లో ఈ తరహా నేరాలను అరికట్టటానికి వేర్వేరు ఏజెన్సీలు పని చేస్తున్నాయని చెప్పారు. అవి కూడా తమకు సమాచారాన్ని అందిస్తాయన్నారు. ఇక టిప్‌లైన్ పేర ఇలాంటి నేరాలకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నట్టు వెల్లడించారు. ఐటీ యాక్ట్2000 ప్రకారం చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోల కోసం సెర్చ్ చేసినా, వాటిని అప్లోడ్ చేసినా నేరమని స్పష్టం చేశారు. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడి పట్టుబడిన వారికి కఠిన శిక్షలు పడతాయన్నారు.
పోర్నోగ్రఫీ కేసులు
----------------------------------
హైదరాబాద్ 22
జైపూర్ 10
చెన్నై 6
బెంగళూరు 4
పూణె 4
కొచ్చి 2
నాగ్‌పూర్ 1
ముంబై 3
దేశవ్యాప్తంగా 52