- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Hyderabad: టోలిచౌక్‌లో అర్థరాత్రి రౌడీషీటర్ వీరంగం
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్(Hyderabad) టోలిచౌక్(Toli Chouk) లో రౌడీషీటర్(Rowdy Sheeter) వీరంగం సృష్టించాడు. అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిపై పిడిగుద్దులతో దాడి చేశాడు. టోలీచౌక్ ప్రాంతానికి చెందిన అమీనుద్దీన్(Ameenuddin) అనే వ్యక్తి ఇటీవలే హజ్ యాత్ర(Haj Tour) ముగించుకొని హైదరాబాద్ చేరుకున్నాడు. నిన్న రాత్రి సమయంలో రోడ్డు పక్కన నిలబడి ఉన్న అమీన్ పై షాకీర్(Shakeer) అనే వ్యక్తి బైక్ పై వచ్చి దాడి చేశాడు. అమీనుద్దీన్ పై పిడిగుద్దులు గుద్దతూ.. విచక్షణారహితంగా కొట్టాడు. అందరూ చూస్తుండగానే నడి రోడ్డుపై దాడికి పాల్పడ్డ దృష్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దీనిపై బాధితుడు ఫిలింనగర్(Film Nagar) పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు దాడి చేసిన షాకీర్ ఇదివరకే రౌడీ షీటర్ గా పేరు ఉందని గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడి ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.