- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కాంగ్రెస్‌లో చేరేందుకు మేయర్ రెడీ.. 10 మంది కార్పొరేటర్లతో జంప్..?
దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్‌ను కోలుకోలేని విధంగా దెబ్బకొట్టేందుకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ ఫిక్స్ అయ్యారు. తనతో పాటు కాంగ్రెస్‌లోకి మరో 15 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లను తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ సాయంత్రం గాంధీ భవన్‌లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం తీర్థం పుచ్చుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, గ్రేటర్ హైదరాబాద్‌పై కన్నేసిన కాంగ్రెస్.. వరుసగా చేరికలను ఆహ్వానిస్తోంది. ఈ క్రమంలోనే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌ను చేర్చుకున్నది. తాజాగా.. ప్రస్తుత మేయర్‌ను చేర్చుకునేందుకు రెడీ అయ్యింది.
ఇందులో భాగంగానే శుక్రవారం వారితో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ భేటీ అయ్యారు. కేశవరావు నివాసంలో జరిగిన ఈ భేటీలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. సుమారు 40 నిమిషాల పాటు కేకే, విజయలక్ష్మిలతో చర్చలు జరిపిన దీపాదాస్ మున్షీ.. వారిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరితే ఇచ్చే పదవి, ఇతర అంశాలకు సంబంధించి కేకే పలు ప్రతిపాదనలు దీపాదాస్ మున్షీ ముందు ఉంచినట్లు ప్రచారం జరుగుతోంది. కేకే పెట్టిన ప్రతిపాదనలపైన పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకున్న అధిష్టానం.. మేయర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.