Cyber Crime : పాతబస్తీ కేంద్రంగా భారీ సైబర్ క్రైమ్.. క్రిప్టో ద్వారా విదేశాలకు నగదు..

by Ramesh N |   ( Updated:2024-08-25 15:04:46.0  )
Cyber Crime : పాతబస్తీ కేంద్రంగా భారీ సైబర్ క్రైమ్.. క్రిప్టో ద్వారా విదేశాలకు నగదు..
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌ కేంద్రంగా భారీగా సైబర్ క్రైమ్ కుంభకోణం పాల్పడినట్లు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ నేరగాళ్లకు సహకరించిన ఇద్దరు ఆటో డ్రైవర్లు బ్యాంకు నుంచి రూ.175 కోట్లు లావాదేవీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. పాతబస్తీలోని షంషీర్‌గంజ్ ఎస్‌బీఐ జాతీయ బ్యాంక్‌లో 6 బ్యాంక్ అకౌంట్ల నగదు లావాదేవీలపై అనుమానంతో బ్యాంక్ అధికారులు తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విచారణలో భాగంగా ఆ నకిలీ ఖాతాల్లో భారీగా లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. నిందితులు పేదల పేరుతో అకౌంట్లు తెరిచి సైబర్ నేరాలకు పాల్పడ్డారని, వివిధ బ్యాంకుల ఖాతాదారుల నుంచి పెద్ద ఎత్తున నకిలీ బ్యాంకు ఖాతాలకు నగదు జమ అయినట్లు అధికారులు గుర్తించారు. హైదరాబాద్‌ నుంచి దుబాయ్‌, ఇండోనేషియా, కంబోడియాలకు నిధులు బదిలీ చేశారని, క్రిప్టో కరెన్సీ ద్వారా ఈ నిధులు ట్రాన్స్‌ఫర్ చేశారని పోలీసుల సమాచారం. దీనిపై మరింత లోతుగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed