హైదరాబాద్ చైల్డ్ డెవలప్‌మెంట్ అధికారి శ్రీదేవి అరెస్ట్

by GSrikanth |
హైదరాబాద్ చైల్డ్ డెవలప్‌మెంట్ అధికారి శ్రీదేవి అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ అధికారి అనిశెట్టి శ్రీదేవి అరెస్ట్ అయ్యారు. శ్రీదేవిని గురువారం సాయంత్రం అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను కరీంనగర్ కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. గతంలో ఆదిలాబాద్ జిల్లాలోని జైనూర్ సీడీపీఓగా పనిచేసిన సమయంలో నిధులను దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు. ఆరోగ్యలక్ష్మి పాల సరఫరా ఖర్చుల్లో జరిగిన అవకతవకలపై కేసు నమోదు చేశారు. నకిలీ ఇండెంట్లు సృష్టించి నగదు కాజేసినట్లు నిర్ధారణ కావడంతో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని పోలీసులు పేర్కొన్నారు. మొత్తం రూ.65.78 లక్షలు దారి మళ్లించినట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించారు. దాదాపు 322 అంగన్వాడీ కేంద్రాల నిధులను దుర్వినియోగం చేశారని తెలిపారు. ఈ స్కామ్ 2015-2016 సమయంలో జరిగిందని అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed