- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Biryani: హైదరాబాద్ బిర్యానీకి అరుదైన గుర్తింపు!
దిశ, డైనమిక్ బ్యూరో: ఆల్ టైమ్ టేస్టీ ఫుడ్‌గా బిర్యానీకి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. బిర్యానీలన్నింటిలో హైదరాబాద్ బిర్యానీకి సపరేట్ క్రేజ్ ఉంది. దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ బిర్యానీకి ఫ్యాన్స్ ఉన్నారు. ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న హైదరాబాద్ బిర్యానీకి మరో గుర్తింపు లభించింది. హైదరాబాదీ బిర్యానీ గురించి 'ఆఫ్రికన్ జనరల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ' నివేదిక ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది. ఆఫ్రికన్ జనరల్ ఆఫ్ ఫుడ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ పలు ఆహార పదార్థాలపై చేసిన పరిశోధనలో 'హెల్తీఫుడ్‌గా హైదరాబాద్ బిర్యానీ' గుర్తింపు పొందింది. ఇది చాలా వరకు ఆరోగ్యకరమైనదని పరిశోధనలో తేలింది. ఇందులో బియ్యం, మాంసం, నూనె, సుగంధ ద్రవ్యాలను ఉపయోగించి తయారు చేస్తారు. ఇందులో అనేక పోషకాలు ఉన్నాయి. హైదరాబాదీ బిర్యానీలో కోడిగుడ్డు, మాంసం, కూరగాయలు వాడటం వల్ల ఆరోగ్యవంతంగా తయారవుతుందని అధ్యయనంలో తేలింది. ఇందులో కలిపే ఇంగ్రిడియంట్స్ ఆరోగ్యంగా ఉంచడం, జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయని అధ్యయనంలో తేల్చారు.