గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి.. రోగిని కాపాడి

by Javid Pasha |
గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి.. రోగిని కాపాడి
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: హైదరాబాద్- సైబరాబాద్​ ట్రాఫిక్​ పోలీసులు కలిసి ఓ ప్రాణాన్ని కాపాడారు. సికింద్రాబాద్ ​ప్రాంతంలోని కిమ్స్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగికి అత్యవసరంగా ఊపిరితిత్తుల మార్పిడి అవసరమైంది. ఈ నేపథ్యంలో వేరే రాష్ట్రం నుంచి వచ్చిన ఊపిరితిత్తులను అంబులెన్స్​ ద్వారా శంషాబాద్​ విమానాశ్రయం నుంచి కిమ్స్ ​ఆస్పత్రికి తీసుకెళ్లటంలో గ్రీన్​ ఛానెల్​ ఏర్పాటు చేసి సహకరించారు.

ఈ క్రమంలో ఊపిరితిత్తులతో ఎయిర్​పోర్టు నుంచి బయల్దేరిన వైద్య సిబ్బంది మొత్తం 35.3 కిలోమీటర్ల దూరాన్ని 23 నిమిషాల్లోనే అధిగమించి హాస్పిటల్​కు చేరుకోగలిగారు. ఆ వెంటనే వైద్యులు రోగికి ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్​ జరిపారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు హైదరాబాద్, సైబరాబాద్​ పోలీసులు కలిసి ఆరుసార్లు గ్రీన్ ఛానెల్​ను ఏర్పాటు చేసి అవయవాలను తరలించటం ద్వారా ఆరుగురి ప్రాణాలను కాపాడారు.

Advertisement

Next Story