HYD: బోర్డు తిప్పేసిన సాఫ్ట్ వేర్ కంపెనీ.. రోడ్డున పడ్డ 700 మంది ఉద్యోగులు

by Sathputhe Rajesh |
HYD: బోర్డు తిప్పేసిన సాఫ్ట్ వేర్ కంపెనీ.. రోడ్డున పడ్డ 700 మంది ఉద్యోగులు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ గచ్చిబౌలిలో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. దీంతో ఇన్సోఫి కంపెనీ ఎదుట ఉద్యోగుల ఆందోళన చేపట్టారు. ఏడాదిన్నరగా సంస్థ జీతాలు చెల్లించడం లేదని వారు వాపోయారు. 650 మంది పేరుతో రూ.4లక్షల చొప్పున, 50 మంది పేరుతో రూ.10లక్షల చొప్పున సంస్థ లోన్ తీసుకున్నట్లు తెలిసింది. జీతాలు ఇవ్వకుండా.. సాలరీ కింద మీ లోన్ కడుతున్నామని కంపెనీ చెప్పిందని ఉద్యోగులు తెలిపారు. జీతాలు అడిగినప్పుడల్లా ట్రైనింగ్ పూర్తి కాలేదని సంస్థ బుకాయించినట్లు ఉద్యోగులు తెలిపారు. ఇన్సోఫి సంస్థలో మొత్తం 700 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. సంస్థ బోర్డు తిప్పేసిందనే సమాచారంతో ఉద్యోగుల కుటుంబాల్లోనూ తీవ్ర ఆందోళన నెలకొంది.

Advertisement

Next Story