- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
HYD : యువకుడు అనుమానాస్పద మృతి.. ప్రేమ వ్యవహారమే కారణమా?
by Sathputhe Rajesh |

X
దిశ, వెబ్‌డెస్క్: మేడ్చల్ జిల్లా ఘట్కేసర్‌లో యువకుడు అనుమానస్పదంగా మృతి చెందాడు. పోచారం మున్సిపాలటీ అన్నోజిగూడలో ఘటన చోటు చేసుకుంది. క్రషర్ గుంతలో మునిగి మహేష్ అనే యువకుడు మృతి చెందాడు. మహేష్ స్నేహితుల వెంట ఈతకు వెళ్లాడు. మహేష్ మృతి పట్ల తల్లి లక్ష్మీ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఓ వర్గానికి చెందిన అమ్మాయిని మహేష్ ప్రేమించాడని ఇదే విషయంలో తన కొడుకుని కొట్టారని తల్లి లక్ష్మీ తెలిపారు. ఈత పేరుతో తీసుకెళ్లి స్నేహితులే చంపారని ఆమె ఆరోపించారు. ఘటనా స్థలానికి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, పోలీసులు చేరుకుని మృతదేహాం కోసం గాలించి వెలికితీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Next Story