HYD : జూనియర్ ఆర్టిస్ట్‌పై అత్యాచారం

by Sathputhe Rajesh |
HYD : జూనియర్ ఆర్టిస్ట్‌పై అత్యాచారం
X

దిశ, వెబ్‌డెస్క్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువకుడు జూనియర్ ఆర్టిస్ట్, యూట్యూబర్‌పై పలుమార్లు అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్ ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన యువతి(29)కి 2021లో గుంటూరు జిల్లా కాకాని ప్రాంతానికి చెందిన యువకుడు రోహిత్ ఖాన్(24) పరిచయమయ్యాడు. ఆమె జూనియర్ ఆర్టిస్ట్ పనిచేస్తూ బోరబండలో నివసిస్తోంది.

ఆ యువతి ఫోన్ నంబర్ సంపాదించిన రోహిత్ ఖాన్ ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించాడు. నమ్మిన యువతిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. పెళ్లి చేసుకోవాలని బాధితురాలు యువకున్ని కోరగా తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story