HYD : శారీరకంగా వాడుకున్నాడు.. పెళ్లి చేసుకుంటానని చెప్పి..

by Sathputhe Rajesh |   ( Updated:2023-02-11 06:38:30.0  )
HYD : శారీరకంగా వాడుకున్నాడు.. పెళ్లి చేసుకుంటానని చెప్పి..
X

దిశ, వెబ్ డెస్క్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిని శారీరకంగా వాడుకున్నాడు. ఆర్థిక అవసరాలు ఉన్నాయంటూ రూ.2లక్షలు దండుకున్నాడు. పెళ్లి విషయం అడగగా మొహం చాటేశాడు. ఈ ఘటనకు సంబంధించి బంజారాహిల్స్ పీఎస్ లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ఓ యువతి ఓ సంస్థలో హౌస్ కీపింగ్ విభాగంలో పనిచేస్తోంది. ఆమెకు కొన్ని రోజుల క్రితం బోలగాణి రమేష్ తో పరిచయం ఏర్పడింది.

ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని ఆ యువకుడు యువతిని నమ్మించాడు. అవసరాలకు డబ్బులు తీసుకున్నాడు. ఫిలిం నగర్‌కు తీసుకువెళ్లి శారీరకంగా వాడుకున్నాడు. అయితే తనను వివాహం చేసుకోవాలని యువతి అడగగా ముఖం చాటేశాడు. దీంతో బాధితురాలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story