- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
HYD : రైతుల శ్రేయస్సు కోసం అనేక నిర్ణయాలు.. : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
దిశ, వెబ్‌డెస్క్: బడ్జెట్ ఎంతో అద్భుతంగా ఉందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. హైదరాబాద్ నాంపల్లి బీజేపీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. సీనియర్ ఆర్థిక వేత్తలు కూడా బడ్జెట్‌ను కొనియాడారన్నారు. వికసిత్ భారత్ కోసం ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌తో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. దేశ ప్రజలందరి అభివృద్ధి సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు. పేదల అభ్యున్నతి కోసం ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని తెలిపారు. రైతుల శ్రేయస్సు కోసం అనేక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. గత ప్రభుత్వం స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయలేదని గుర్తు చేశారు. ఉచిత రేషన్‌ను మరో ఐదేళ్లు పొడిగించడం గొప్ప విషయం అన్నారు. దేశంలో ద్రవ్యోలబ్బణం క్రమంగా తగ్గుముఖం పడుతోందన్నారు. నీతి ఆయోగ్ భేటీని సీఎం రేవంత్ రెడ్డి బహిష్కరించడం సరికాదన్నారు. సమస్యలు ఉంటే మీటింగ్‌కు హాజరై తెలపాలని కేంద్ర మంత్రి ముఖ్యమంత్రికి సూచించారు.