HYD: మలక్ పేటల్ మహిళ హత్య.. వెలుగులోకి సంచలన విషయాలు

by Sathputhe Rajesh |
HYD: మలక్ పేటల్ మహిళ హత్య.. వెలుగులోకి సంచలన విషయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ శ్రద్ధా వాకర్ హత్యకేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇదే తరహాలో హైదరాబాద్ లో ఓ హత్య కలకలం రేపింది. మలక్ పేటలో నర్సు అనురాధ రెడ్డి మర్డర్ కేసులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అనురాధను హత్య చేసిన చంద్రమోహన్ రెడ్డి శరీర భాగాలను ఫ్రిజ్‌లో పెట్టి దుర్వాసన రాకుండా కెమికల్స్, అగర్ బత్తిలు, కర్పూరం వినియోగించాడు.

అనురాధ బతికి ఉన్నట్లు సీన్ క్రియేట్ చేశాడు. చార్ ధామ్ వెళ్తున్నట్లు అందరిని నమ్మించాడు. నాలుగు రోజుల తర్వాత తలను మూసీనది ఒడ్డున పడేసి మిగతా భాగాలను ఇంట్లోనే పెట్టాడు. అయితే మృతురాలు కేర్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తూ వడ్డీ వ్యాపారం చేస్తోంది. వడ్డీ వ్యాపారంలో గొడవల కారణంగానే అనురాధ హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story