HYD : రూ.200ల కోసం గొడవ.. క్యాబ్ డ్రైవర్ మృతి

by Sathputhe Rajesh |
HYD : రూ.200ల కోసం గొడవ.. క్యాబ్ డ్రైవర్ మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఉప్పర్ పల్లిలో దాడికి గురైన క్యాబ్ డ్రైవర్ మృతి చెందాడు. 2022 జులైలో క్యాబ్ విషయంలో వివేక్ రెడ్డి, వెంకటేశ్ మధ్య ఘర్షణ జరిగింది. నల్గొండలో రెండేళ్లుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ వెంకటేష్ మృతి చెందాడు. 2022 జులైలో రూ.200 కోసం వివేక్ రెడ్డి, వెంకటేష్ మధ్య గొడవ జరిగింది. రెండేళ్ల క్రితం 20 మందిని పిలిచి వెంకటేష్‌పై వివేక్ రెడ్డి దాడి చేయించాడు. వెంకటేష్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో రెండేళ్లుగా చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు.

Advertisement

Next Story