HYD : కుక్కల దాడిలో ఎనిమిదేళ్ల బాలుడు మృతి

by Rajesh |
HYD : కుక్కల దాడిలో ఎనిమిదేళ్ల బాలుడు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్/ పటాన్ చెరు : రాష్ట్రంలో చిన్నారులపై కుక్కల దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా, సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇస్నాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఇస్నాపూర్‌లో కుక్కలు కరిచి ఎనిమిదేళ్ల బాలుడు మృతి చెందాడు. బహిరంగ మలవిసర్జనకు వెళ్తుండగా ఇస్నాపూర్ నుంచి నందిగామ వెళ్లే రోడ్డులో మహిధార వెంచర్‌లో విశాల్(8) అనే బాలుడిపై కుక్కలు దాడి చేశాయి. బాలుడి మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. అలాగే.. ముత్తంగిలో 7నెలల చిన్నారిని కూడా కుక్కలు తీవ్రంగా గాయపర్చాయి. కాగా, చిన్నారిని హుటాహుటిన పటాన్ చెరు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed