HYD : క్యూలో నిల్చొని ఓటు హక్కును వినియోగించుకున్న చిరంజీవి, వెంకటేశ్

by Sathputhe Rajesh |   ( Updated:2023-11-30 03:41:02.0  )
HYD : క్యూలో నిల్చొని ఓటు హక్కును వినియోగించుకున్న చిరంజీవి, వెంకటేశ్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఇక, మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సమేతంగా క్యూలో నిల్చొని జూబ్లీహిల్స్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతకుముందు హీరో వెంకటేశ్ తన ఓటు హక్కును వినియోగించారు. పోలింగ్ ప్రారంభం కాగానే హీరోలు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ క్యూలో నిల్చొని వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక, హీరోలను ఓటర్లు ఆసక్తిగా చూశారు.

Advertisement

Next Story