HYD : బండ రాయితో కొట్టి మహిళ దారుణ హత్య

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-13 05:06:06.0  )
HYD : బండ రాయితో కొట్టి మహిళ దారుణ హత్య
X

దిశ, వెబ్‌డెస్క్: మహిళ దారుణ హత్య కలకలం రేపింది. సికింద్రాబాద్ మహంకాళి పీఎస్ పరిధిలో మహిళ దారుణ హత్యకు గురైంది. యాచకురాలిపై రాయితో దాడి చేసి మరో యాచకుడు హత్య చేశాడు. మద్యం మత్తులో అర్ధరాత్రి యాచకుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్లు తెలిసింది. రాణిగంజ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సమీపం వద్ద ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న మహిళపై గుర్తు తెలియని వ్యక్తి బండరాయితో మోది హత్య చేశాడు. భర్త భయంతో అరుస్తున్నా భార్యపై బండరాయితో దాడి చేశాడు. తీవ్రగాయాలు కావడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story