- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
HYD: నగరవాసులకు బిగ్ అలర్ట్.. ప్రధాని మోడీ రాకతో నేడు, రేపు పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. వాడవాడల, ప్రతి వీధిలో గడపగడపకు తిరుగుతూ ఓటర్లను తమ ఓట్లు వేయాలంటూ అభ్యర్థిస్తున్నారు. అదేవిధంగా జాతీయ పార్టీల నేతలు తెలంగాణలో ప్రచారం చేయడానికి క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ ఇవాళ రాత్రి హైదరాబాద్‌కు రానున్నారు. ఈ నేపథ్యంలో బేగంపేట్ నుంచి రాజ్‌భవన్ వెళ్లే మార్గంలో రాత్రి 7.50 నుంచి రేపు ఉదయం 8.25 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. అదేవిధంగా బేగంపేట విమానాశ్రయం నుంచి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, మోనప్ప ఐలాండ్, రాజ్‌భవన్ వరకు వాహనాలను అనుమతి లేదని తెలిపారు. ప్రధాని మోదీ రేపు ఉదయం తిరిగి బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా రేపు ఉదయం 8.35 నుంచి 9.10 వరకు రాజ్ భవన్, మోనప్ప ఐలాండ్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ వరకు వాహనాలకు ఎంట్రీ ఉండదని తెలుస్తోంది. దీంతో ఆ రూట్లో వెళ్లే వారు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.