HYD : రాష్ట్ర రాజధానిలో మరో సంచలన ఘటన.. ఇంట్లో బంధించి మహిళపై తోటి ఉద్యోగి అత్యాచారం

by Sathputhe Rajesh |
HYD : రాష్ట్ర రాజధానిలో మరో సంచలన ఘటన.. ఇంట్లో బంధించి మహిళపై తోటి ఉద్యోగి అత్యాచారం
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర రాజధానిలో మరో దారు చోటు చేసుకుంది. మహిళను రూమ్‌లో బంధించి తోటి ఉద్యోగి అత్యాచారానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. హైదరాబాద్ బేగంపేటకు చెందిన సంతోష్ చైతన్య అనే వ్యక్తి తోటి మహిళా ఉద్యోగిని బంధించి రేప్ చేశాడు. ఏపీ అనంతపురం జిల్లాకు చెందిన ఓ మహిళ ఉద్యోగరిత్యా నగరానికి వచ్చింది. అయితే సదరు మహిళకు ఉండటానికి రూమ్ లేక పోవడంతో ఇల్లు వెతకడంలో సాయం చేస్తానని సంతోష్ చైతన్య నమ్మించాడు. అంత వరకు తన ఇంట్లో ఉండాలని తెలిపాడు. అయితే తనతోనే ఇంట్లో చెల్లెలుతో పాటు తల్లి ఉంటారని నమ్మబలికాడు.

అది నమ్మిన మహిళ ఇంటికి వెళ్లే సరికి ఎవరూ లేకపోవడాన్ని గమనించింది. ఇదే విషయమై సంతోష్ చైతన్యను ప్రశ్నించగా మహిళను బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. కొన్ని రోజుల తర్వాత మహిళను బయటకు వదిలిపెట్టాడు. అనంతరం మహిళ ఎన్ని సార్లు కాల్ చేసినా సంతోష్ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. మోసపోయినట్లు గ్రహించిన మహిళ పోలీసులను ఆశ్రయించి సదరు వ్యక్తిపై ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story