- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాపర్ వైర్ దొంగల హల్‌చల్..
దిశ, రాయపర్తి: కాపర్ దొంగలు విజృంభిస్తున్నారు. ఏకంగా రైతుల మోటార్ వైరులను దొంగలిస్తున్నారు. మండలంలోని కాట్రపల్లి వాంకుడోత్ తండా పోతిరెడ్డిపల్లి బురానిపల్లి గ్రామాల్లో గతంలో కేబుల్ వైర్లు దొంగిలించిన ఘటనలు చాలా ఉన్నాయి. తాజాగా మండలంలోని కాట్రపల్లి గ్రామంలోని గత మూడు రోజులుగా బోర్ నుండి స్టార్టరుకు వెళ్లి కేబుల్ కాపర్ వైర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు అపరించుకుపోతున్నారు. దీంతో రైతులు లబోదిబో అంటూ మొత్తుకుంటున్నారు. తాజాగా మండలంలోని కాట్రపల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం గ్రామంలోని ఎండి అల్తాఫ్ రాపాక రాజు కుందూరు వెంకటరెడ్డి రైతులతో పాటు మరో 20 మంది రైతుల కేబుల్ కాపర్ వైర్‌ను గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండనక వాననక కాయ కష్టం చేసి పంటలు పండించుకునేందుకు ఎంతో కృషి చేస్తున్న రైతులకు కాపర్ దొంగలతో తీవ్రంగా నష్టం వాటిల్లుతుంది.
కాపర్ వైర్‌ను దొంగలిస్తున్న దుండగులు వారికి ఏడికి వస్తే ఆడికి వైర్‌ను లాకెళ్తున్నారు. దీంతో రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయంపై స్థానిక ఎస్సై బండారు రాజును వివరణ కోరగా తన వద్దకు ఈ రోజే సమాచారం వచ్చిందని త్వరలోనే కాపర్ వైర్ దొంగలను పట్టుకునేందుకు నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలోనే నిందితులను పట్టుకొని శిక్షించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రైతులు తమకు సహకరించి అనుమానాస్పద స్థితిలో ఉన్న వ్యక్తులను గుర్తించి తమకు సమాచారం అందించాలని కోరారు. మొత్తానికి మండలంలోని అన్ని గ్రామాల్లో రైతులు కాపరు వైరు దొంగతనం గురించి కలవర చెంచుతున్నారు. కాపర్ వైరు దొంగలను పట్టుకొని కఠినంగా శిక్షించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.