- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భార్య పుట్టింటికి వెళ్లడం భరించలేక యువకుడు ఆత్మహత్య
by GSrikanth |
X
దిశ, మెదక్ టౌన్: భార్య పుట్టింటికి వెళ్లిందన్న మనస్తాపంతో వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లాలోని నవాబ్ పేటలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. నవాబ్ పేటకు చెందిన షేక్ జహంగీర్(23)కు మూడు నెల క్రితం మేడ్చల్‌కు చెందిన యువతితో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత జహంగీర్ కుటుంబాన్ని సరిగా పట్టించుకోకపోవడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. మూడ్రోజుల క్రితం ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరగడంతో అలిగిన భార్య పుట్టింటికి వెళ్ళింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన జహంగీర్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story