తెలంగాణలో అధికారం ఏ పార్టీదో తేల్చేసిన ఇండియా టుడే సర్వే

by Rajesh |   ( Updated:2023-10-21 09:50:49.0  )
తెలంగాణలో అధికారం ఏ పార్టీదో తేల్చేసిన ఇండియా టుడే సర్వే
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. అన్ని పార్టీలు తమ వ్యూహాలకు పదును పెట్టాయి. నవంబర్ 30 న పోలింగ్ జరగనుండగా డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా టుడే-సీ ఓటర్ సర్వే తెలంగాణలో హంగ్ వస్తుందని తేల్చింది. 119 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి సర్వే ఫలితాలను వెల్లడించింది. కాంగ్రెస్ 11శాతం ఓటు షేర్ పెంచుకుంటుందని, బీఆర్ఎస్ 9శాతం ఓటు షేర్ కోల్పోతుందని పేర్కొంది. 39 శాతం ఓటు షేర్‌తో కాంగ్రెస్ పార్టీ 54 సీట్లు గెల్చుకుంటుందని తెలిపింది. బీఆర్ఎస్ 38 ఓటు షేర్‌తో 49 సీట్లు గెలుచుకుంటుదని స్పష్టం చేసింది. బీజేపీ 8 స్థానాల్లో గెలుస్తుందని తెలిపింది. ఎఐఎంఐఎం 7 సీట్లు, బీఎస్పీ ఒక సీటు గెలుస్తుందని స్పష్టం చేసింది.

ఒక వేళ బీఆర్ఎస్ ఎంఐఎం మద్దతు తీసుకుంటే మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 56 కు చేరనుంది. ఇక మేజిక్ ఫిగర్ కోసం ఆ నలుగురు ఎమ్మెల్యేలను కేసీఆర్ ఇతర పార్టీల నుంచి లాక్కొవడం పెద్ద టాస్క్ కాకపోవచ్చిన సర్వే అభిప్రాయపడింది. మరో సర్వే ఏజెన్సీ రీజినల్ ఔట్ రీచ్ సర్వే సంస్థ నార్త్ తెలంగాణలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసి 75 స్థానాల్లో గెలుస్తుందని తేల్చింది. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు, సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ పండగగా రాహుల్ గాంధీ ప్రకటించడం వంటి అంశాలు కాంగ్రెస్ 37-40 స్థానాలలో గెలుపునకు దోహదపడతాయని సర్వే అభిప్రాయపడింది. కాంగ్రెస్‌కు 44 శాతం, బీఆర్ఎస్‌కు 41శాతం, బీజేపీకి 10 ఓటింగ్ శాతం దక్కుతుందని ఈ సర్వే తేల్చింది.

Advertisement

Next Story

Most Viewed