Breaking:హ్యూమన్‌ ప్లాస్మా అమ్మకాల ముఠా అరెస్ట్..

by Ramesh N |   ( Updated:2024-02-02 14:51:34.0  )
Breaking:హ్యూమన్‌ ప్లాస్మా అమ్మకాల ముఠా అరెస్ట్..
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో వివిధ బ్లడ్ బ్యాంకుల్లో డ్రగ్స్ కంట్రోల్ తెలంగాణ ఆకస్మిక దాడులు నిర్వహించింది. ఈ మేరకు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ దాడుల్లో హ్యూమన్‌ ప్లాస్మా, హ్యూమన్ బ్లడ్‌ను అక్రమంగా అమ్ముతున్న ముఠాను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ సోదాల్లో భారీగా ప్లాస్మా యూనిట్స్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

ఈ నేపథ్యంలోనే హైదారాబాద్ లోని సికిర ఆస్పత్రి బ్లడ్‌ బ్యాంక్‌, న్యూలైఫ్ బ్లడ్ సెంటర్, ఆర్ఆర్‌ బ్లడ్‌ బ్యాంక్‌లో సోదాలు చేపట్టామని, క్లిమెన్స్‌, క్లినోవి రీసెర్చ్‌, నవరీచ్‌ క్లినిక్, జీ7 ఎనర్జీ, క్యూపీఎస్‌ బయోసర్వీస్‌లో తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. శిల్ప మెడికల్, జెనీరైస్‌ క్లినిక్, వింప్టా ల్యాబ్స్‌లోనూ డ్రగ్‌ అధికారుల సోదాలు నిర్వహించారు.

హైదరాబాద్ మూసాపేట్ పరిధిలోని హేమో సర్వీస్ లాబొరేటరీస్‌లో భారీగా అక్రమ నిల్వలు, అపరిశుభ్రమైన హ్యూమన్ బ్లడ్, ప్లాస్మా యూనిట్స్ పట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఈ లాబొరేటరీస్ నుంచే వివిధ బ్లడ్ బ్యాంకులకు 2016 నుంచి సప్లై చేస్తున్నారని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed