సగం జీతం ఇంటి కిరాయిలకే.. బతికేదెలా? హైదరాబాద్ వాసులపై సర్వేలో షాకింగ్ విషయాలు

by Ramesh N |
సగం జీతం ఇంటి కిరాయిలకే.. బతికేదెలా? హైదరాబాద్ వాసులపై సర్వేలో షాకింగ్ విషయాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: పెరిగిన ధరలతో మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. శతాధిక కోట్లకు పైగా భారతీయులలో పేదలు, నిరుపేదలు గణనీయమైన సంఖ్యలో ఉన్నారని తెలిసింది. ఇటీవల ది గ్రేట్ ఇండియన్ వాలెట్ పేరిట ఓ శాస్త్రీయ సర్వే జరిగింది. భారత్ లోని 17 నగరాలకు చెందిన జీవన స్థితి గతులపై వివరాలు సేకరించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగర వాసులపై హోమ్ క్రెడిట్ ఇండియా అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. హైదరాబాదీలు తమ ఆదాయంలో అధిక మొత్తం అద్దెలకు, పిల్లల చదువులకు ఖర్చు చేస్తున్నారని సర్వేలో తేలింది. ప్రతి ఏటా ఖర్చులు పెరగడంతో ఆదాయం కూడా పెరుగుతుందని నగరవాసుల్లో ఆశభావం నగర వాసుల్లో వెల్లడి అయిందని సర్వే సంస్థ వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే నగర వాసుల నెలవారి సగటు ఆదాయం రూ. 44 వేల వరకు పెరిగిందని స్పష్టం చేసింది. అయితే ఖర్చుల విషయానికి వస్తే ఆదాయం కన్నా ఖర్చులే పెరిగాయని నగర ప్రజలు వెల్లడించారు.

నెలవారి ఖర్చు 24 వేలు..

2023లో నెలవారి ఖర్చు 19 వేలు ఉండగా.. ఇప్పుడు 24 వేలకు చేరిందని సర్వేలో తేలింది. హైదరాబాద్‌లో నివసించేవారి ఆదాయం 21 శాతం ఇంటి అద్దెలకే ఖర్చు అవుతోందని వెల్లడైంది. మరోవైపు పిల్లల చదువులకు 17 శాతం ఆదాయం ఖర్చు అవుతున్నట్లు నివేదిక తెలిపింది. ఇక ఫ్యామిలీ ట్రిప్స్ లాంటి ఆలోచించి పెట్టే ఖర్చు 35 శాతం చేస్తున్నారని తెలిసింది. మరోవైపు రుచికరమైన తిండి కోసం నెలవారి ఆదాయంలో 28 శాతం ఖర్చు చేస్తున్నారని సర్వేలో వెల్లడైంది.

సినిమాల కోసం 19 శాతం ఖర్చు

అలాగే సినిమాలు 19 శాతం, ఓటీటీ కోసం 10 శాతం, ఫిట్ నెస్ కోసం 6 శాతం ఖర్చు చేస్తున్నారని సర్వేలో తేలింది. అయితే, ఇంటి కిరాయిలు భారీగా పెరిగాయని, సగం జీతం కీరాయిలకే పోతే ఎలా బతకాలని పబ్లిక్ వాపోతున్నారు. నగర వాసులపై ఆదాయం, ఖర్చులతో పాటు మరికొన్ని అంశాలపై కూడా సర్వే జరిగింది. సిటిజన్స్‌కు 41 శాతం మందికి ఆన్‌లైన్ మోసాల గురించి తెలుసని, 27 శాతం మోసాల బారిన పడ్డారని సర్వేల్లో పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed