- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ ఎస్ఐ అభ్యర్థులకు భారీ గుడ్ న్యూస్.. ప్రతి అభ్యర్థికి 8 మార్కులు
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఎస్‌ఐ ఉద్యోగాలకు ఈ నెల 7వ తేదీన ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన 'కీ' పేపర్‌ను అధికారులు ఆగస్ట్ 12వ తేదీన విడుదల చేశారు. అయితే, ఈ కీ పేపర్‌లో మొత్తం 8 ప్రశ్నలను డిలీట్ చేయగా.. మరో 6 ప్రశ్నలకు ఒకటి కన్నా ఎక్కువ సరైన సమాధానాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ ఆరు ప్రశ్నల్లో ఒక దానికి మూడు సరైన ఆప్షన్లు ఉండగా.. మరో 5 ప్రశ్నలకు రెండు సరైన ఆప్షన్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే, డిలీట్ చేసిన 8 ప్రశ్నలకు పరీక్ష రాసిన అభ్యర్థులందరికీ మార్కులు కలుపుతామని అధికారులు తెలిపారు. దీంతో ప్రతి అభ్యర్థికి అదనంగా 8 మార్కులు కలవనున్నాయి. 8 మార్కులు అదనంగా కలవడంతో ఎక్కువ మంది అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్షలో క్వాలిఫై అయ్యే చాన్స్ ఉంది. అలాగే అభ్యర్థులకు ప్రాథమిక కీపై ఇంకా ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆగస్టు 15న సాయంత్రం 5 గంటల వరకు తెలియజేయాలని అధికారులు కోరారు.