BREAKING: తెలంగాణ రైతులకు భారీ గుడ్ న్యూస్.. రైతు భరోసా నిధులు రిలీజ్ చేసిన సర్కార్

by Satheesh |   ( Updated:2024-05-06 14:48:22.0  )
BREAKING: తెలంగాణ రైతులకు భారీ గుడ్ న్యూస్.. రైతు భరోసా నిధులు రిలీజ్ చేసిన సర్కార్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం రైతులకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది. పంట పెట్టుబడి సాయం కింద రైతులకు అందించే రైతు భరోసా (రైతు బంధు) నిధులను వ్యవసాయ శాఖ సోమవారం విడుదల చేసింది. ఇప్పటి వరకు ఐదు ఎకరాలలోపు వారికి నిధులు విడుదల చేసిన సర్కార్.. సోమవారం ఐదు ఎకరాలు పై బడిన రైతులకు ఫండ్స్ రిలీజ్ చేసింది. ఈ మేరకు రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను వ్యవసాయ శాఖ జమ చేసింది. రైతు భరోసా కోసం ప్రభుత్వం దాదాపు రూ.2000 కోట్ల నిధులను విడుదల చేసినట్లు సమాచారం. కాగా, ఎన్నికల వేళ రైతు భరోసా స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే.

అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఎకరానికి రూ.15 వేల చొప్పున ఇస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఇంతవరకు పూర్తిగా మేం ఇచ్చిన రూ. 10 వేలు కూడా ఇవ్వలేదని ప్రభుత్వంపై బీఆర్ఎస్ విమర్శలు గుప్పి్స్తోంది. కేసీఆర్ ఉంటే టంగ్ టంగ్‌ను వెంటనే నిధులు విడుదల అయ్యేవని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతు బంధు ఆగిపోయిందని ఎన్నికల వేళ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది. ఈ క్రమంలోనే అలర్ట్ అయిన సీఎం రేవంత్, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌కు ధీటుగా కౌంటర్ ఇచ్చారు. మే 9లోపు రైతు బంధు నిధులు విడుదల చేస్తామని సీఎం రేవంత్ పలుమార్లు ప్రకటించారు. సీఎం అనౌన్స్ చేసిన కొన్ని రోజుల్లోనే రైతు బంధు నిధులు విడుదల కావడం గమనార్హం.

Read More...

రైతులకు శుభవార్త.. వారి అకౌంట్లలో రైతు‌బంధు డబ్బులు జమ!

Advertisement

Next Story

Most Viewed